స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ టోర్నీలో భాగంగా, భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఆడుతున్న సూర్య కుమార్.. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్‌లో ఏకంగా 4 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. కేవలం 2,714 బంతుల్లో ఈ ఘనత సాధించి, ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 4 వేల పరుగులు పూర్తి చేసిన భారతీయ బ్యాటర్‌గా నిలిచాడు.
ఐపీఎల్ చరిత్రలో ఓవరాల్‌గా చూస్తే, క్రిస్ గేల్, ఏబీ డీవిలియర్స్‌లు మాత్రే 2,568 బంతుల్లో అత్యంత వేగంగా 4 వేల పరుగులు చేసాశారు. వీరి తర్వాత మూడో క్రికెటర్‌గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. ఇదే మ్యాచ్‌లో రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో తన ఇన్నింగ్స్‌లో తొలి సిక్సర్ కొట్టడం ద్వారా ఐపీఎల్‌లో 150 సిక్సర్లు పూర్తి చేసుకున్న మరో మైలురాయిని కూడా సూర్యకుమార్ అధికమించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో 28 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 54 పరుగులు చేశాడు.