ఈ మ్యాచ్‌లో ఆసీస్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఫలితంగా వార్నర్, ఫించ్‌లు ఓపెనర్లుగా దిగి.. తొలి వికెట్‌కు 142 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో వార్నర్ 83 పరుగుల వద్ద, ఫించ్ 60 రన్స్ వద్ద ఔట్ అయ్యారు. వీరిలో ఫించ్ 69 బంతుల్లో 60 పరుగులు చేసి, ఒక సిక్సు, ఆరు ఫోర్ల సాయంతో 60 పరుగులు చేసిన ఔటయ్యాడు. అనంతరం కొద్ది సేపటికే డేవిడ్ వార్నర్ ఔటయ్యాడు. అతడు 77 బంతుల్లో 3 సిక్సులు, 7 ఫోర్లతో 83 పరుగులు చేశాడు.
ఆ తర్వాత మూడో ఆర్డరులో వచ్చిన స్మిత్ మైదానంలో పరుగుల వర్షం కురిపించాడు. దూకుడుగా ఆడుతూ 2 సిక్సులు, 14 ఫోర్లతో సెంచరీ బాదాడు. 104 పరుగుల వద్ద ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో లాబుస్చాగ్నే 51, మ్యాక్స్ వెల్ 10 పరుగులతో ఉన్నారు. ఆస్ట్రేలియా జట్టు స్కోరు 45.4 ఓవర్లలో 337/3గా ఉంది. భారత బౌలర్లలో షమీ, పాండ్యాలకు ఒక్కో వికెటు దక్కాయి.