Vaibhav Suryavanshi: ఇంగ్లాండ్‌తో మ్యాచ్.. 52 బంతుల్లో సెంచరీ కొట్టిన వైభవ్.. వరల్డ్ రికార్డ్

సెల్వి

శనివారం, 5 జులై 2025 (23:07 IST)
Vaibhav Suryavanshi
ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైనప్పటికీ సెంచరీ బాదిన రాజస్థాన్ రాయల్స్ స్టార్ 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ శనివారం వూస్టర్‌లో ఇండియా అండర్-19, ఇంగ్లాండ్ అండర్-19 జట్ల మధ్య జరిగిన నాల్గవ యూత్ వన్డేలో 52 బంతుల్లో సెంచరీ చేసి అంతర్జాతీయ రికార్డులు సృష్టించాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు, 13 ఫోర్లు ఉన్నాయి, తర్వాత బెన్ మేయెస్ చేతిలో 143 (78) పరుగుల వద్ద ఔటయ్యాడు.
 
వైభవ్ ఆది నుంచే ఆధిపత్యం చెలాయించడంతో 53 బంతుల్లో సెంచరీ సాధించి.. పాకిస్తాన్‌కు చెందిన కమ్రామ్ గులాం రికార్డును అధిగమించాడు. తద్వారా పురుషుల యూత్ వన్డే ఇంటర్నేషనల్స్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. 
 
ఈ సిరీస్ ప్రారంభంలో, అతను 20 బంతుల్లో అర్ధ సెంచరీ బాదిన తర్వాత రిషబ్ పంత్ సాధించిన వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును అధిగమించలేకపోయాడు. భారత రెడ్-బాల్ వైస్-కెప్టెన్ రిషబ్ పంత్ యూత్ క్రికెట్‌లో 19 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు