అలీబాగ్‌లో హాలిడే హోం కోసం కోహ్లీ ఎంత ఖర్చు చేశారో తెలుసా?

ఠాగూర్

గురువారం, 16 జనవరి 2025 (15:31 IST)
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దంపతులు త్వరలోనే కొత్త ఇంటిలోకి గృహప్రవేశం చేశారు. ఈ ఇంటి నిర్మాణం కోసం కోహ్లీ - అనుష్క దంపతులు ఏకంగా రూ.32 కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. ముంబైలోని అలీబాగ్‌లో నిర్మించిన ఇంటి కోసం ఈ భారీ మొత్తంలో  వ్యయం చేసినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
ప్రస్తుతం ఈ ఇంటి గృహప్రవేశం కోసం అందంగా ముస్తాబైంది. ఇందుకోసం సిబ్బంది ఆ ఇంటిని పూలు, లైట్లతో అందంగా అలంకరిస్తున్న వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కోహ్లీ దంపతులు ముంబై నుంచి బుధవారం నాడు తమ అలీబాగ్ ఇంటి గృహ ప్రవేశం కోసం అలీబాగ్‌కు వెళ్లిన విషయం తెల్సిందే. 
 
కాగా, విరాట్ కోహ్లి, అనుష్క శర్మల అలీబాగ్ ఇంటికి రూ.32 కోట్లు ఖర్చయినట్లు సమాచారం. ఈ జంట 2022లో అలీబాగ్‌లో రూ.19 కోట్లు వెచ్చించి ఇంటి స్థలం కొనుగోలు చేసింది. ఇంటి నిర్మాణానికి మరో రూ.13 కోట్లు వెచ్చించారు. 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సువిశాలమైన విల్లా, స్విమ్మింగ్ పూల్ సహా గార్డెన్‌ను ఈ దంపతులు ఏర్పాటు చేసుకున్నారు. 
 
ఈ విల్లాలో ఉష్ణోగ్రత నియంత్రిత స్విమ్మింగ్ పూల్, బెస్పోక్ కిచెన్, నాలుగు బాత్రూమ్‌లు, జాకుజీ, విశాలమైన గార్డెన్, కవర్ పార్కింగ్, స్టాఫ్ క్వార్టర్స్ ఇలా ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఇంటిని ఫిలిప్ ఫౌచే నేతృత్వంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆర్కిటెక్టులు డిజైన్ చేశారు. ఇది కాలిఫోర్నియా కొంకణ్ తరహా నాలుగు పడక గదులతో కూడిన విల్లా టైవ్ నివాసం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు