కోహ్లీ స్టెప్పులు వారెవ్వా.. క్రిస్ గేల్‌కూ నేర్పించాడు (Video)

సోమవారం, 12 ఆగస్టు 2019 (18:55 IST)
వెస్టిండీస్‌‍తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. తొలి వన్డే సందర్భంగా ఓ వైపు మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తుంటే, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మైదానంలోనే డీజే పాటలకు స్టెప్పులు వేసి కెమెరాలకు చిక్కాడు.


ఇంకా కోహ్లీ స్టెప్పులు అభిమానులను అలరించాయి. అనంతరం ఈ డ్యాన్స్ గురించి కోహ్లీ మాట్లాడుతూ.. మ్యూజిక్ విన్నప్పుడు తనకు డ్యాన్స్ చేయాలనిపిస్తుందని చెప్పాడు. 
 
విరామం అనంతరం మైదానంలోకి వచ్చిన కోహ్లీ డీజే పాటలకు స్టెప్పులు వేసాడు. డీజేకు అనుగుణంగా సహచర ఆటగాళ్లతో డాన్స్ చేసాడు. క్రిస్ గేల్ కూడా తనదైన శైలిలో కోహ్లీతో కలిసి డాన్స్ చేసాడు. అనంతరం మైదాన సిబ్బందితో సైతం సరదాగా గడిపాడు. కోహ్లీ స్టెప్పులు వేయడంతో మైదానంలోని అభిమానులు పండగ చేసుకున్నారు. 
 
ఇక తాజాగా, ఆదివారం ఫోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా విండిస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (125 బంతుల్లో 120; 14 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీతో రాణించిన సంగతి తెలిసిందే.

Teacher: No one will dance in the class.
Le Backbenchers:@BCCI @imVkohli#INDvWI #India #Kohli pic.twitter.com/9R1fulVBHT

— Parth Goradia (@parthgoradia13) August 8, 2019

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు