"దక్షిణాసియా దేశాల సంస్కృతిని పరిశీలిస్తే, ఒక్కసారి గొప్ప పేరు వచ్చిందంటే అది మిమ్మల్ని తినేస్తుంది. మైకంలో ముంచేస్తుంది. మిమ్మల్ని అవినీతిపరుగులుగా మారుస్తుంది. ఇక్కడ ఒక్క రాత్రిలో పది పార్టీల్లో పాల్గొనేవాళ్లు ఉంటారు కూడా. ఈ సంస్కృతి నాపైనా తీవ్ర ప్రభావం చూపింది.
కానీ, నా భార్య హూమా అనారోగ్యంతో బాధపడుతూ చివరిక్షణాల్లో పడిన వేదన చూశాక నేను మళ్లీ డ్రగ్స్ జోలికి వెళ్లలేదు. తాను స్పృహలో లేకపోయినప్పటికీ నాలో మార్పు తీసుకొచ్చింది. అది మొదలు నేను మరెపుడూ పతనం కాలేదు అని వసీం అక్రమ్ చెప్పుకొచ్చారు.
ఇంగ్లండ్‌లో ఓ పార్టీలో పాల్గొన్న సందర్భంగా తొలిసారి డ్రగ్స్ తీసుకున్నానని తెలిపారు. అక్కడి నుంచి డ్రగ్స్ లేకుండా ఉండలేని స్థితికి చేరుకున్నానని వెల్లడించారు. కొకైన్ తీసుకుంటేనే తాను పని చేయగలనని భావించేవాడినని అక్రమ్ తెలిపారు. అయితే, డ్రగ్స్ తీసుకునే విషయాన్ని తాను తన భార్యకు తెలియకుండా దాచేందుకు ప్రయత్నించానని కానీ అది సాధ్యపడలేదన్నారు.