సంజిదా ఇస్లామ్ పెళ్లి కూతురు గెటప్‌లో బ్యాట్ పట్టి..?

గురువారం, 22 అక్టోబరు 2020 (15:27 IST)
Sanjida Islam
వెడ్డింగ్ షూట్‌లో వైవిధ్యం కోసం కొత్త కొత్తగా ఆలోచిస్తారు. తాజాగా ఓ క్రికెటర్ వెడ్డింగ్ ఫోటో షూట్‌కు మాత్రం క్రికెట్ అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆమె మరెవరో కాదు బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్ సంజిదా ఇస్లామ్. 24 సంవత్సరాల సంజిదా ఇస్లామ్ చీర కట్టుతో, ఒంటినిండా నగలతో గ్రౌండ్‌లో బ్యాటింగ్ చేస్తూ చేసిన వెడ్డింగ్ షూట్‌లో పాల్గొంది.
 
బంగ్లాదేశ్ అంతర్జాతీయ మహిళల క్రికెట్ జట్టుకు ఎనిమిదేళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంజిదా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ విమెన్‌గా రాణిస్తోంది. అక్టోబర్ 17న రంగాపూర్‌కు చెందిన ఫస్ట్ క్లాస్ క్రికెటర్ మిమ్ మొసాద్‌డీక్‌ను పెళ్లి చేసుకుంది. క్రికెట్ మీద ఉన్న అభిమానంతో థీమ్‌తోనే వెడ్డింగ్ షూట్ చేశారు. పెళ్లికూతురుగా ముస్తాబై.. బ్యాట్‌ను చేతిలో పట్టుకుని పట్టి కవర్ డ్రైవ్, పుల్ షాట్స్ ఫోజులతో అదరగొట్టారు.
 
ఈ ఫోటో షూట్‌పై క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆమె వెడ్డింగ్ షూట్ చాలా బాగుంది అంటూ పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఫోటోలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) దృష్టిలో పడ్డాయి. ఆభరణాలు, క్రికెటర్ బ్యాట్, క్రికెటర్లకు వివాహ ఫోటోషూట్‌లు అంటూ ఐసీసీ ఈ ఫోటోలను రీట్వీట్ చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు