తాను కనుక ఫిట్‌గా వుంటే మరో పదేళ్లు తన కెరీర్‌ను కొనసాగిస్తానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. మరో రెండు నెలల్లో 29వ ఏట అడుగుపెడుతున్న కోహ్లీ ఓ ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తమలో చాలామందికి ఈ కెరీర్‌లో ఎంతకాలం కొనసాగుతామనే విషయంలో క్లారిటీ వుండదన్నాడు. కానీ తన విషయానికి వస్తే.. ఇప్పటికంటే మరింత కఠినంగా శిక్షణ తీసుకుంటే మరో పదేళ్లు కొనసాగే అవకాశం ఉందని తెలిపాడు.