పొట్టిగా వుంటే పోయేదేముంది.. విరాట్ కోహ్లీపై విమర్శలు

బుధవారం, 10 అక్టోబరు 2018 (12:57 IST)
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కోహ్లీని ప్రశంసించాడు. ప్రస్తుత క్రికెట్ శకంలో వినోదాన్ని పంచే క్రికెటర్లలో విరాట్ కోహ్లీకి పీటర్సన్ మినహాయింపు ఇచ్చాడు. ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్‌ కోహ్లిని మినహాయిస్తే క్రికెట్‌లో నిజమైన వినోదాన్ని పంచేవారు కానీ, సూపర్‌ స్టార్లు కానీ కనిపించడమే లేదని చెప్పుకొచ్చాడు. 
 
ఈ విషయం తనను ఆవేదనకు గురిచేస్తుందని.. ప్రస్తుత క్రికెట్ శకంలో వినోదాన్ని పంచేవారు తగ్గిపోయారని.. ఎంటర్‌టైన్ చేసే క్రికెటర్ల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోందని కెవిన్ పీటర్సన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. 
 
అసలు సిసలైన ఆట క్రికెటర్లలో కనిపించడం లేదని పెదవి విరిచాడు. ఒకప్పటి సూపర్‌ స్టార్లు ముత్తయ్య మురళీధరన్‌, ఆంబ్రోస్‌, వాల్ష్‌  సచిన్‌ టెండూల్కర్‌, రికీ పాంటింగ్‌, షేన్‌ వార్న్‌, ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌, ఆండ్రూ ఫ్లింటాఫ్‌, వసీమ్‌ అక్రమ్‌లు అత్యంత వినోదాన్ని అందించే క్రికెటర్లని కెవిన్ గుర్తు చేశాడు. ప్రస్తుతం అలాంటి క్రికెటర్లూ లేరు. అలాంటి వినోదాత్మక ఆటతీరు మైదానంలో కనిపించట్లేదని కెవిన్ పీటర్సన్ వ్యాఖ్యానించాడు.
 
కోహ్లీపై విమర్శలు ఎందుకని? ఆమె కంటే పొట్టిగా వున్నాడని?
టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఓ ప్రమోషనల్‌ ఈవెంట్‌లో వ్యవహరించిన తీరుతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఓ వాచ్‌ల కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ అయిన కోహ్లీ పాల్గొన్న ప్రమోషనల్ ఈవెంట్లో టెన్నిస్‌ యువ క్రీడాకారిణి కర్మాన్‌ కౌర్‌ కూడా హాజరైంది. 
 
ఈ సందర్భంగా కలిసి పోజిచ్చేందుకు సిద్ధమైన విరాట్‌.. ఆమె తనకంటే హైట్‌ కావడంతో ఇద్దరం ఒకే ఫ్రేమ్‌లో కనబడాలని పక్కనే ఉన్న పోడియంపైకి ఎక్కి ఫొటోలకు పోజిచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
ఎందుకంత అహం..? మహిళ కంటే పొట్టిగా వుంటే పోయేదేముంది.. ఆమె పక్కనే నిలబడవచ్చుగా.. పోడియం ఎక్కాల్సిన పనేముంది అంటూ నెటిజన్లు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు