Yuvraj Singh 7 Sixes: 7 సిక్సర్లు, ఒక ఫోర్.. యువరాజ్ సింగ్ అదుర్స్.. (video)

సెల్వి

శుక్రవారం, 14 మార్చి 2025 (17:05 IST)
yuvraj
ఇండియన్ మాస్టర్స్ లీగ్‌లో భారత స్టార్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ తన సత్తా ఏంటో చూపాడు. యువరాజ్ 30 బంతుల్లో 59 పరుగులు చేశాడు. 7 సిక్సర్లు, ఒక ఫోర్ బాదాడు. ఈ మ్యాచ్‌లో యువరాజ్ కొట్టిన అద్భుతమైన సిక్సర్లు 2007 ఐసీసీ వరల్డ్ టీ20లో ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌పై ఒకే ఓవర్‌లో యువరాజ్ ఆరు సిక్సర్లు కొట్టిన అద్భుత ప్రదర్శనను అభిమానులకు గుర్తు చేశాయి. గడియారాన్ని వెనక్కి తిప్పుతూ, తనదైన వింటేజ్ సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు యువరాజ్ సింగ్. 
 
యువరాజ్ ఆస్ట్రేలియా లెగ్-స్పిన్నర్ మెక్‌గెయిన్‌ బంతికి ఒకే ఓవర్‌లో మూడు సిక్సర్లుగా బాదాడు. తద్వారా క్రికెట్‌లో అతిపెద్ద హిట్టర్లలో ఒకరిగా తన హోదాను మరోసారి నిరూపించుకున్నాడు. 
 
ఈ మ్యాచ్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా తన ప్రతిభను ప్రదర్శించాడు. 
 
30 బంతుల్లో 7 ఫోర్లతో 42 పరుగులు చేశాడు. భారత మాజీ ఆల్ రౌండర్ స్టూవర్ట్ బిన్నీ 21 బంతుల్లో 36 పరుగులు చేయగా, యూసుఫ్ పఠాన్ 10 బంతుల్లో 23 పరుగులు చేశాడు. ఇర్ఫాన్ పఠాన్ కూడా 7 బంతుల్లో 19 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. దీంతో ఆస్ట్రేలియా కేవ‌లం 126 ప‌రుగుల‌కే ఆలౌటైంది. 94 ర‌న్స్ తేడాతో ఇండియ‌న్ మాస్ట‌ర్స్ జ‌ట్టు గెలిచింది. రెండవ సెమీఫైన‌ల్లో శ్రీలంక మాస్ట‌ర్స్ జ‌ట్టు ఇవాళ వెస్టిండీస్ మాస్ట‌ర్స్‌తో త‌ల‌ప‌డనున్న‌ది.
 
దీంతో షేన్ వాట్సన్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా మాస్టర్స్ టీమ్, యువరాజ్ దెబ్బకు పూర్తిగా నష్టపోయింది. డోహెర్టీ లెఫ్ట్-ఆర్మ్ స్పిన్ బౌలింగ్‌ను యువరాజ్ తునాతునకలు చేశాడు. 2007లో డర్బన్‌లో యువరాజ్ ఆస్ట్రేలియా బౌలింగ్‌ను చిత్తుచేసినట్లుగానే, ఈసారి కూడా అదే మజాను అభిమానులు ఆస్వాదించారు. 

????????????????????????'???? ????????????-???????????????????????????????? 5️⃣0️⃣! ????

His powerful display leads him to a remarkable half-century! ⚡????

Watch the action LIVE ➡ on @JioHotstar, @Colors_Cineplex & @CCSuperhits! #IMLT20 #TheBaapsOfCricket #IMLonJioHotstar #IMLonCineplex pic.twitter.com/QhJRdyh4zu

— INTERNATIONAL MASTERS LEAGUE (@imlt20official) March 13, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు