అక్కడ ఎన్నో విషయాలు నేర్చుకున్నా..: ధావల్

న్యూజిలాండ్‌లో టెస్ట్ క్రికెట్‌లో ఆడేందుకు అవకాశం లభించనప్పటికీ, డ్రస్సింగ్ రూమును పంచుకోవడం తనకు మంచి అనుభవమని టీం ఇండియా ఆటగాడు ధావల్ కులకర్ణి తెలిపాడు. అక్కడ నేర్చుకున్న విషయాలు తన భవిష్యత్‌కు ఎంతో ఉపయోగపడతాయని చెప్పాడు.

టెస్టులో ఆడే అవకాశం లభించినప్పటికీ తానిప్పుడు పరిణితి సాధించానని ధావల్ అన్నాడు. ముంబయికి చెందిన ఈ పేస్ బౌలర్ న్యూజిలాండ్‌లో చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ విజయం సాధించిన జట్టులో సభ్యుడు. అయితే ధావల్‌కు ఈ సిరీస్‌లో ఆడేందుకు అవకాశం రాలేదు.

అవకాశం లభించినప్పటికీ, న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన టీం ఇండియాలో సభ్యుడిని అవడం తన కెరీర్‌కు ఎంతో మేలు చేస్తుందన్నాడు. గత ఏడాదే రంజీ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ధావల్‌కు అనూహ్యంగా జాతీయ జట్టులో చోటు లభించింది.

గత రంజీ సీజన్‌లో 42 వికెట్లు పడగొట్టి, అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. అయితే న్యూజిలాండ్‌‍తో జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్‌ల్లోనూ ధావల్ పెవీలియన్‌కే పరిమితమయ్యాడు.

వెబ్దునియా పై చదవండి