ఇంగ్లండ్ కోచ్‌గా నేనా? నో ఛాన్స్..!: కిర్‌స్టన్

ఇంగ్లండ్ కోచ్‌గా రేసులో కిర్‌స్టన్ ఉన్నాడనే వార్తలకు తెరపడింది. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు రేసులో తాను ఉన్నానని లండన్ మీడియాలో వస్తోన్న ఊహాగానాలను భారత కోచ్ గ్యారీ కిర్‌స్టన్ కొట్టిపారేశారు. ఇంగ్లండ్ కోచ్ పదవికి తాను అభ్యర్థిని కాదని కోచ్ స్పష్టం చేశాడు. ఇంగ్లండ్ కోచ్ వ్యవహారంపై మీడియాలో వచ్చే వార్తలు ఏ మాత్రం నిజం కావని, అవన్నీ వదంతులేనని కిర్‌స్టన్ వెల్లడించాడు.

ఇదిలా ఉండగా.. ఇంగ్లండ్ కోచ్ రేసులో కిర్‌స్టెన్ ముందంజలో ఉన్నాడని బ్రిటిష్ దిన పత్రిక ది గార్డియన్ ఓ కథనాన్ని ప్రచురించింది. కోచ్ పదవి రేసులో ఆండీ ఫ్లవర్‌తో పాటు దక్షిణాఫ్రికా కోచ్ మికీ ఆర్థర్ కూడా గార్డియన్ తన ప్రచురణలో వెల్లడించింది. అయితే దక్షిణాఫ్రికా జాతీయ జట్టుతో 2011 వరకు ఉన్న ఒప్పందానికి మాత్రమే తాను కట్టుబడి ఉన్నానని ఆర్థర్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి