ఐపీఎల్-3: చెన్నై సూపర్ కింగ్స్‌పై నెగ్గిన డెక్కన్ ఛార్జర్స్!
FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్లో భాగంగా హైదరాబాద్ ఫ్రాంచైజీ జట్టు డెక్కన్ ఛార్జర్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన 42వ లీగ్ మ్యాచ్‌లో డెక్కన్ ఛార్జర్స్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సుమన్ మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. దీంతో డెక్కన్ ఛార్జర్స్ ఐపీఎల్-3 సెమీస్ ఆశలను నిర్జీవం చేసుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు మాత్రమే చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 139 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన డెక్కన్ ఛార్జర్స్ ఐదు బంతులు మిగిలివుండగానే చేధించింది.
సుమన్ అర్ధ సెంచరీ (44 బంతుల్లో 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 55 పరుగులు), సైమండ్స్ (22 బంతుల్లో 2సిక్స్‌లు, ఫోర్‌తో 27 పరుగులు నాటౌట్) చెలరేగడంతో ఛార్జర్స్ 139 పరుగుల లక్ష్యాన్ని మరో ఐదు బంతులు మిగిలివుండగానే ఛేదించింది. దీంతో డెక్కన్ ఛార్జర్స్ ఐపీఎల్-3లో వరుసగా రెండో విజయాన్ని సాధించింది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 8వికెట్లకు 138 పరుగులు చేసింది. చెన్నై బ్యాట్స్మెన్ల జోరుకు ఛార్జర్స్ బౌలర్లు బ్రేక్ వేశారు. చెన్నై జట్టులో రైనా ఒక్కడే రాణించి 42 బంతుల్లో 52 పరుగులు చేశాడు. కాగా మూడు వికెట్లు పడగొట్టి ఛార్జర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన హారిస్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.