ఐపీఎల్-3: ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు పంజాబ్ బ్రేక్ వేస్తుందా..!?
PTI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై నెగ్గాలని భావిస్తోంది. ఇప్పటికే సెమీఫైనల్ అవకాశాలను చేతులారా చేజార్చుకున్న పంజాబ్, ఇకపై జరిగే ప్రతి ఐపీఎల్ మ్యాచ్‌లోనూ గెలుపొందడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
ఈ క్రమంలో అగ్రస్థానంలో కొనసాగుతున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సేన ముంబై ఇండియన్స్‌పై శుక్రవారం 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇదే తరహాలో గౌతం గంభీర్ నాయకత్వం వహించే ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను కూడా చిత్తుగా ఓడించాలని పంజాబ్ భావిస్తోంది. పంజాబ్-ఢిల్లీల మధ్య ఆదివారం మధ్యాహ్నం 44వ ఐపీఎల్ లీగ్ మ్యాచ్ ఢిల్లీలో జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై నెగ్గి జోరు మీదున్న సంగక్కర సేన, ఢిల్లీపై కూడా విజయం సాధించాలని తహతహలాడుతోండి
మరోవైపు.. 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ తన 39వ ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓటమిని చవిచూసింది. కానీ పంజాబ్‌పై ఢిల్లీ గట్టిపోటీని ప్రదర్శించే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ మ్యాచ్‌లో ఢిల్లీకి పంజాబ్ బ్రేక్ వేస్తుందా..? లేదా..? అనేది వేచి చూడాల్సిందే..!.