ఐసీసీ ర్యాంకింగ్స్: మార్పులేని భారత్ స్థానం

న్యూజిలాండ్ గడ్డపై చారిత్రాత్మక సిరీస్ విజయం సాధించిన భారత జట్టు తాజాగా ప్రకటించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్ట్ ర్యాంకింగ్స్‌లోనూ మూడో స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్‌పై వారి దేశంలో టీం ఇండియా 41 ఏళ్ల తరువాత టెస్ట్ సిరీస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ విజయం సాధించినప్పటికీ టీం ఇండియా తాజా ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలోనే నిలిచింది.

ఇదిలా ఉంటే ఎనిమిదో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ జట్టు తాజా సిరీస్‌లో రెండు మ్యాచ్‌లను డ్రాగా ముగించడం ద్వారా తన ఖాతాలో ఒక పాయింట్ చేర్చుకుంది. టీం ఇండియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లను న్యూజిలాండ్ డ్రాగా ముగించింది. తొలి మ్యాచ్‌లో గెలిచిన టీం ఇండియా సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది.

వర్షం కారణంగా డ్రాగా ముగిసిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో టీం ఇండియా విజయం సాధించినట్లయితే టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ ఖాతాలో 118 పాయింట్లు చేరేవి. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు టీం ఇండియా ఖాతాలో 118 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. న్యూజిలాండ్‌ టెస్ట్ సిరీస్ 2-0తో టీం ఇండియా విజయం సాధించే ఉంటే.. రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాకన్నా భారత్ ఖాతాలో ఒక్క పాయింట్ మాత్రమే తక్కువగా ఉండేది. అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియాకు 10 పాయింట్ల దూరంలో నిలిచేది.

వెబ్దునియా పై చదవండి