ఢిల్లీపై గెలుపుకోసం గంగూలి సేన ఆరాటం...

ఇప్పటికే టాప్- 4లో తన స్థానాన్ని పదిలపరుచుకున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఢీకొనేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి తన సత్తాను చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. జట్టు సారథి గౌతమ్ గంభీర్ తమ జట్టు ఆటగాళ్లు రాణిస్తున్నప్పటికీ ప్రత్యర్థి జట్టును తక్కువ అంచనా వేయలేమని అంటున్నాడు.

మరోవైపు స్థానాల పట్టికలో ఆరో స్థానానికి దిగజారిన నైట్ రైడర్స్ సైతం సర్వశక్తులు ఒడ్డి ఢిల్లీపై విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్నది. నిజానకి ఢిల్లీ డేర్ డెవిల్స్ ఈ మ్యాచ్‌లో ఓడినా ఆ జట్టుకు పెద్ద ప్రమాదమేమీ ఉండదు. ఎటొచ్చీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కే చిక్కు. అపజయం పాలైతే ఇక ఇంటిదారి పట్టాల్సి రావచ్చు.

ఈ పరిస్థితుల్లో గంగూలి సేన ఢిల్లీపై గెలుపుకు ఎటువంటి ఆట తీరును ప్రదర్శిస్తుందో చూడాల్సిందే.

వెబ్దునియా పై చదవండి