బ్యాట్స్‌మెన్లు ధీటుగా రాణించాలి: పాంటింగ్

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అత్యున్నత స్థానాన్ని కైవసం చేసుకోవాలంటే, దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో బ్యాట్స్‌మెన్లు ధీటుగా రాణించాలని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు.

వన్డే సిరీస్‌లో 2-1 ఆధిక్యంతో ఉన్న దక్షిణాఫ్రికాను మిగిలిన రెండు వన్డేల్లో మట్టికరిపించాలని పాంటింగ్ ఆటగాళ్లకు సూచించాడు. దీనికోసం ఓపెనర్లతో పాటు బరిలోకి దిగే ఐదు బ్యాట్స్‌మన్లు మెరుగైన ఆటతీరును ప్రదర్శించాలని రికీ పేర్కొన్నాడు.

ఇదిలా ఉండగా.. మూడో వన్డేలో 25 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా ఓడిన సంగతి తెలిసిందే. మూడో వన్డేల్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు, ఆరు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా నిర్ణయించిన లక్ష్యాన్ని ఆస్ట్రేలియా చేధించలేకపోయింది. దీంతో మూడో వన్డేలో ఆసీస్ ఏడు వికెట్ల నష్టానికి 264స్కోరును మాత్రమే చేసి పరాజయం పాలైంది.

వెబ్దునియా పై చదవండి