భారత్‌ను కివీస్ మట్టికరిపిస్తుంది: ఆండీ మోల్స్

నేపియర్‌లో భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టును న్యూజిలాండ్ సొంతం చేసుకుంటుందని ఆ జట్టు కోచ్ ఆండీ మోల్స్ ధీమా వ్యక్తం చేశారు. కివీస్ జట్టులో బౌలర్లు ధీటుగా రాణించారని, బ్యాట్స్‌మన్లు కూడా పరుగుల కురిపించారని మోల్స్ ప్రశంసల వర్షం కురిపించాడు.

రెండో టెస్టు ఐదో రోజైన సోమవారం మైదానంలో కివీస్ క్రికెటర్లు భారత్‌ను మట్టికరిపిస్తారని మోల్స్ నమ్మకం వ్యక్తం చేశాడు. టీం ఇండియా బ్యాట్స్‌మన్లు గౌతం గంభీర్, సచిన్ టెండూల్కర్లను కివీస్ బౌలర్లు అవుట్ చేస్తే కచ్చితంగా మ్యాచ్ న్యూజిలాండ్ సొంతమవుతుందని ఆండీ మోల్స్ అన్నారు.

నాలుగో రోజైన ఆదివారం టీం ఇండియా ఓ వికెట్ మాత్రమే కోల్పోయిందని, సోమవారం కివీస్ బౌలర్లు ధీటుగా రాణించి లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మోల్స్ ఆశించారు.

ఇదిలా ఉండగా.. తొలి ఇన్నింగ్స్‌లో 5-6 తేడాతో కివీస్ ఆధిక్యంలో నిలిచిందని, తమ జట్టు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉందని మోల్ చెప్పారు. తమ జట్టు ఆటగాళ్ల బౌలింగ్, బ్యాటింగ్ చాలా మెరుగైందని, మైదానంలో ప్రతర్థి జట్టుపై ధీటుగా రాణిస్తున్నారని కోచ్ వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి