మళ్లీ అగ్రస్థానం దక్కించుకున్న ఆస్ట్రేలియా

దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించడంతో ఆస్ట్రేలియా జట్టు తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. డర్బన్‌లో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా జట్టు విజయభేరీ మోగించిన విషయం తెల్సిందే. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో మొదటి వన్డేలో నెగ్గిన ఆసీస్‌ తిరిగి నెంబర్‌వన్ స్థానానికి ఎగబాకింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 125 పాయింట్లను తన ఖాతాలో వేసుకున్న ఆసీస్ మొదటి స్థానంలో ఉంది.

అలాగే 123 పాయింట్లతో దక్షిణాఫ్రికా రెండో స్థానంలో కొనసాగుతోంది. భారత జట్టు మూడో స్థానంలో ఉన్నాయి. బ్యాటింగ్ విభాగంలో మహేంద్ర సింగ్ ధోనీ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. సచిన్ రెండు స్థానాలు ఎగబాకి 11 స్థానంలో నిలిచాడు. యువరాజ్ సింగ్ ఐదు, వీరేంద్ర సెహ్వాగ్ ఏడో స్థానాల్లో కొనసాగుతున్నారు.

వెబ్దునియా పై చదవండి