రాణించిన బౌలర్లు: న్యూజిలాండ్ 197 ఆలౌట్

వెల్లింగ్టన్ టెస్టులో భారత్ బౌలర్లు రాణించారు. జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, ఇషాంత్ శర్మలు తమ సత్తాను చాటడంతో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు కేవలం 197 పరుగులకే ఆలౌట్ అయింది. పేస్‌ బౌలర్‌ జహీర్‌ఖాన్‌ (5/65), హర్భజన్‌ (3/43)లు కివీస్‌ రెక్కలు విరిచారు. ఆ జట్టులో టేలర్ ఒక్కడే 42 పరుగులే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.

అంతకుముందు 375/9 ఓవర్‌నైట్‌ స్కోరుతో బ్యాటింగ్‌ కొనసాగించిన భారత్‌ మరో నాలుగు పరుగులు చేసిన అనంతరం ఇషాంత్‌ శర్మ (18) ఔట్‌ అయ్యాడు. దీంతో భారత్‌ ఇన్నింగ్స్‌కు 379 పరుగుల వద్ద తెరపడింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్‌ జట్టు బ్యాటింగ్ లైనప్ భారత బౌలింగ్ ముందు తలవంచింది.

ఆ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ టేలర్‌ (42) ఒక్కడే ఓ మోస్తారుగా రాణించారు. గుప్తిల్‌ (17), ఫ్లిన్‌ (2), రైడర్‌ (3), ఫ్రాంక్లిన్‌ (15), మెక్‌కల్లమ్‌ (24), వెటోరి (11), సౌథీ (16), ఒబ్రియాన్‌ (19)లు తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఫలితంగా భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 18 పరుగుల ఆధిక్యం లభించింది.

వెబ్దునియా పై చదవండి