వెల్లింగ్టన్ టెస్టు: రెచ్చిపోయిన జహీర్‌ఖాన్

సొంత గడ్డపై భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు కుప్పకూలింది. భారత పేసర్ జహీర్ ఖాన్‌ బౌలింగ్‌కు కివీస్ బ్యాట్స్‌మెన్లు దాసోహమయ్యారు. ఫలితంగా ఆ జట్టు 160 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. జహీర్ ఖాన్ ఐదు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు తొలి రోజు ఓవర్‌నైట్ స్కోరు 375 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. తన తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగులకు ఆలౌట్ అయింది.

ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ ఆటగాళ్లను క్రీజ్‌లో కుదురుకోనీయకుండా జహీర్ బౌలింగ్ చేశాడు. 21 పరుగుల వద్ద తొలి వికెట్‌‍ను పడగొట్టిన జహీర్ మరోమారు రెచ్చిపోయి 31 పరుగుల వద్ద ఓపెనర్ గుప్తిల్‌ను రెండో వికెట్‌గా క్లీన్ బౌల్డ్ చేశాడు. అప్పటి నుంచి కివీస్ జట్టు క్రమంగా వికెట్లను కోల్పోతూ వచ్చింది. టేలర్ మాత్రమే రాణించి 42 పరుగుల అత్యధిక స్కోరు చేశాడు.

అయితే టెయిల్ ఎండ్ బ్యాట్స్‌మెన్లు రెండంకెల స్కోరు చేయడంతో కివీస్ ఓ మోస్తారు స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో జహీర్ ఖాన్ ఐదు వికెట్లు తీయగా, ఇషాంత శర్మ ఒకటి, హర్భజన్ సింగ్ రెండు వికెట్లు తీసి కివీస్ రెక్కలు విరిచారు.

వెబ్దునియా పై చదవండి