షోయబ్ అక్తర్‌కు పి.సి.బి మళ్లీ పిలుపు

వివాదాస్పద క్రికెటర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్‌కు మంచి రోజులు వచ్చాయి. ఈనెలలో ఆస్ట్రేలియాతో జరుగున్న వన్డే సిరీస్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారులు అక్తర్‌కు కబురు పెట్టారు. ఏప్రిల్ 22 నుంచి మే 7వ తేదీ వరకు జరిగే వన్డే సిరీస్‌ కోసం ప్రకటించిన జాతీయ జట్టులో అక్తర్‌కు చోటు కల్పించారు. అలాగే, ఇంగ్లండ్‌లో జరుగనున్న ట్వంటీ-20 ప్రపంచ కప్‌ కోసం 30 మంది సభ్యులతో కూడిన ప్రాబబుల్స్‌ను పిసిబి ఎంపిక చేసింది.

దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ సెలక్టర్ అబ్దుల్ ఖాదిర్ మాట్లాడుతూ పిసిబి మెడికల్ ప్యానెల్, జట్టు మెడికల్ ట్రైనర్ డేవిడ్ డైర్, డాక్టర్ సోహైల్ సలీం‌లు ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ మేరకు అక్తర్‌కు జాతీయ జట్టులో చోటు కల్పించినట్టు వివరించాడు. మ్యాచ్‌లో కోసం బోర్డు నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టుల్లో అక్తర్ పాస్ అయ్యాడని చెప్పాడు.

అక్తర్ ఎంతో అనుభవజ్ఞుడైన ఆటగాడు. అతని చేరిక జట్టుకు కొండత అండలాంటిదన్నారు. స్వదేశంలో శ్రీలంక జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌లో పాక్ జట్టులో స్థానం సంపాందించినప్పటికీ, పూర్తిగా విఫలమయ్యాడు. ఫలితంగా టెస్టు సిరీస్‌కు దూరంగా ఉంచారు.

వెబ్దునియా పై చదవండి