భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మైనపు ప్రతిమను ఈ నెల 13వ తేదీన ముంబైలో ఆవిష్కరించనున్నారు. వాస్తవానికి ప్రతిమను లండన్‌లో ఆవిష్కరించాల్సి ఉండగా, సచిన్ చేతుల మీదుగానే ఈ బొమ్మను ఆవిష్కృతమవడం విశేషం. లండన్‌లోని మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో మూడు మాసాల సమయంలో ఈ విగ్రహాన్ని తయారు చేశారు.
టీం ఇండియా మాస్టర్ బ్లాస్టర్గా రాణించిన సచిన్ మైనపు ప్రతిమ లండన్‌లోని ప్రఖ్యాత మేడమ్ తస్సద్ మ్యూజియంలో వెలియనుంది. ప్రఖ్యాత ప్రముఖుల మైనపు బొమ్మలకు మాత్రమే నెలవైన మ్యూజియం మేడమ్ తస్సద్ మ్యూజియం. ఇందులో సచిన్ మైనపు బొమ్మకు చోటు దక్కింది. ఇందులో చోటు దక్కించుకున్న తొలి భారత క్రీడాకారుడు కూడా సచినే కావడం మరో విశేషం.
ఇలా విదేశాల్లో మేడమ్ తస్సద్ ప్రతిమను ఆవిష్కరిస్తుండటం కూడా ఇదే తొలిసారి. ప్రత్యేకించి మైనంతో రూపొందించిన ఈ ప్రతిమను తయారు చేయడానికి మూడు నెలలు పట్టింది. మాస్టర్ బాస్టర్ సచిన్ విరాళంగా ఇచ్చిన తెల్ల రంగు క్రికెట్ దుస్తులతో దీన్ని తీర్చిదిద్దినట్లు కళాకారులు తెలిపారు. భారత విఖ్యాత క్రికెటర్లు సునీల్ గవాస్కర్, హర్యానా హరికెన్ కపిల్‌దేవ్ తదితరులకు దక్కని ఈ అరుదైన గౌరవం సచిన్‌కు లభించడం గమనార్హం.