ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచెల పోటీల్లో భాగంగా.. సోమవారం రాత్రి జరిగిన 46వ లీగ్ మ్యాచ్‌లో డెక్కన్ ఛార్జర్స్ నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం సులభేమని చెప్పాడు. అయితే రాయల్ ఛాలెంజర్స్ పేలవమైన ఆటతీరును ప్రదర్శించడంతో పరాజయం పాలైయ్యామని కుంబ్లే చెప్పుకొచ్చాడు.
డెక్కన్ ఛార్జర్స్‌తో సోమవారం రాత్రి జరిగిన 46వ లీగ్ మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అనిల్ కుంబ్లే మాట్లాడుతూ.. డెక్కన్ ఛార్జర్స్ 152 పరుగుల లక్ష్యాన్ని చేధించడం సాధ్యమైనప్పటికీ, తమ జట్టు గట్టిపోటీని ప్రదర్శించడంలో విఫలమైందని అన్నాడు.
అయితే రాహుల్ ద్రావిడ్ 49 పరుగుల ఇన్నింగ్స్‌ను ఇంకాసేపు కొనసాగించి ఉంటే తప్పకుండా గెలిచే వాళ్లమని కుంబ్లే వెల్లడించాడు. కానీ రాహుల్ 49 పరుగుల వద్ద పెవిలియన్ దారి పట్టడం, తద్వారా బెంగళూరు పరాజయం పాలవడంతో నిరాశకు గురయ్యాయని తెలిపాడు. అయితే ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టిన బెంగళూరు బౌలర్ డేల్ స్టెయిన్‌ను కుంబ్లే ప్రశంసించాడు.