యూఏఈలో ఆస్ట్రేలియాతో జరుగనున్న వన్డే సిరీస్‌లో పాకిస్తాన్ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్‌కు స్థానం దక్కింది. ఆస్ట్రేలియాతో ఐదు వన్డేలు, ఒక ట్వంటీ-ట్వంటీ మ్యాచ్‌ను ఆడనున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టులో, అక్తర్‌తో పాటు ఉమర్ గుల్, సోహెల్ తన్వీర్, రావ్ ఇఫ్తికార్, సోహెల్ ఖాన్, యాసీర్ అరఫత్ మరియు వహాబ్ రియాజ్‌లకు కూడా చోటు దక్కింది.
మోకాలి గాయం కారణంగా, గత 16 నెలల్లో రెండు వన్డేలు, మూడు ట్వంటీ-20 మ్యాచ్‌లను మాత్రమే ఆడిన 33 ఏళ్ల అక్తర్‌కు, శుక్రవారం ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో అక్తర్ ఒక గంటకు 140 కిలోమీటర్ల మేర బౌలింగ్ చేయగలిగాడని, ప్రస్తుతం షోయబ్ ఫిట్‌నెస్ క్రమంగా ఉందని చీఫ్ సెలక్టర్ అబ్దుల్ క్వాదిర్ అన్నారు.
గత 2007 డిసెంబరులో టీం ఇండియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌తో అక్తర్‌పై క్రమశిక్షణారాహిత్య వేటు పడింది. దీంతో అక్తర్‌ను ఐదేళ్లపాటు ఐసీసీ నిషేధించింది. ఆ తర్వాత 95వేల జరిమానాతో, 18 నెలల పాటు అక్తర్‌పై బహిష్కరణ వేటును తగ్గించింది. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరిలో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో పాల్గొన్న అక్తర్ మోకాలి గాయం కారణంగా ఆటకు దూరమైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో.. ఆస్ట్రేలియాతో జరుగనున్న తాజా సిరీస్‌కు అక్తర్‌ను జట్టులోకి తీసుకునే దిశగా సెలక్షన్ కమిటి ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షలో అక్తర్ పాస్ అయ్యాడు.
ఇదిలా ఉండగా.. దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియా-పాకిస్తాన్‌ల మధ్య ఈ నెల 27వ తేదీ నుంచి 24వ తేదీ వరకు తొలి రెండు వన్డే మ్యాచ్‌లు జరుగనున్నాయి. తదుపరి మూడు వన్డే మ్యాచ్‌లు అబుదాబిలో ఏప్రిల్ 27, మే 1, 3 తేదీల్లో జరుగుతాయి.
అదేవిధంగా.. దుబాయ్ వేదికగా ఆసీస్-పాక్‌ల మధ్య జరిగే ట్వంటీ-20 మ్యాచ్ మే 7వ తేదీన జరుగనుంది. మరోవైపు.. ఈ సిరీస్‌లో పాల్గొనే ఆటగాళ్ల వివరాలను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించే అవకాశాలున్నాయి.