ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ అలెక్ బెడ్సర్ మృతి!

FILE
లెజండరీ ఇంగ్లాండ్ క్రికెటర్ అలెక్ బెడ్సర్ తుదిశ్వాస విడిచారని వార్తలొస్తున్నాయి. 91 సంవత్సరాల బెడ్సర్ ఆదివారం కన్నుమూశాడని బీబీసీ మరియు ప్రెస్ అసోసియేషన్ న్యూస్ ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన బెడ్సర్, చికిత్స ఫలించక మరణించినట్లు ఏజెన్సీ వార్తల ద్వారా తెలిసింది.

ఇంకా ఇంగ్లాండ్ బౌలర్‌‌గా రాణించి, దేశం కోసం పలు విజయాలు సంపాదించిపెట్టిన బెడ్సర్.. చిరస్మరణీయుడని ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ గిల్లీస్ క్లార్క్ ప్రశంసించాడు. బెడ్సర్ మరణం పట్ల క్లార్క్ సంతాపం వ్యక్తం చేశారు. బౌలర్ బెడ్సర్ మరణం.. క్రికెటర్లను, అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసిందని క్లార్ అన్నాడు.

ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 236 వికెట్లు పడగొట్టిన బెడ్సర్, 51 టెస్టు మ్యాచ్‌ల్లో ఆడాడు. ఇంకా 23 సంవత్సరాల పాటు ఇంగ్లాండ్‌కు క్రికెటర్‌గా సేవలందించిన బెడ్సర్.. సెలక్టర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు.

వెబ్దునియా పై చదవండి