ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకున్న కివీస్

సొంత గడ్డపై జరుగుతున్న తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్ జట్టు ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకుంది. హామిల్టన్‌లోని సెడెన్ పార్కు మైదానంలో భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ నాలుగో రోజున కివీస్ ఓటమి ఖాయమైంది. అయితే, ఇన్నింగ్స్ ఓటమి నుంచి బయటపడటం ఆ జట్టుకు ఊరటనిచ్చే అంశం. కివీస్ ఇన్నింగ్స్‌ను భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ శాసించాడు.

ఏకంగా ఐదు వికెట్లు తీసి కోలుకోని దెబ్బతీశాడు. ఫలితంగా ఆ జట్టు భారత్ చేతిలో ఓటమికి మరో రెండు వికెట్ల దూరంలో ఉంది. అయితే, ఒక వైపు వికెట్లు పడుతున్నా మరోవైపు ఆ జట్టు వికెట్ కీపర్ మెక్‌కల్లమ్ టెయిల్ ఎండ్‌ల సాయంతో అర్థ సెంచరీ సాధించడమే కాకుండా, ఇన్నింగ్స్ ఓటమి నుంచి జట్టును రక్షించాడు.

బౌలర్ ఒబ్రియన్‌తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 80 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పడమే కాకుండా, సెంచరీకి మరో 20 పరుగుల దూరంలో ఉన్నాడు. అంతకుముందు భజ్జీ తన స్పిన్ బంతులతో గుప్తిల్ (48), ఫ్లైన్ (67), రైడర్ (21), ఫ్రాంక్లిన్ (14), వెట్టోరి (21), ఒబ్రిన్ (14)‌లను అవుట్ చేశాడు.

వెబ్దునియా పై చదవండి