ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య కీలక సమరం మంగళవారం జరుగనుంది. మంగళవారం రాత్రి చెన్నై వేదికగా జరిగే 48వ ఈ లీగ్ మ్యాచ్ అటు కేకేఆర్‌కు ఇటు చెన్నై సూపర్ కింగ్స్‌కు కీలకం కానుంది. చెన్నై వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో గంగూలీసేన కేకేఆర్, ధోనీసేన చెన్నై సూపర్ కింగ్స్‌లు సెమీఫైనల్ బెర్త్ కోసం హోరాహోరీగా తలపడతాయి.
అయితే ఇరు జట్లూ సెమీఫైనల్లోకి అడుగుపెట్టాలంచే చెరో మూడు మ్యాచ్‌ల్లో నెగ్గాల్సిన అవసరం ఉంది. కాగా.. చెన్నై-కేకేఆర్‌లు సెమీస్‌పై ఆశలను సజీవం చేసుకునేందుకు ప్రతీ మ్యాచ్‌లోనూ గట్టిపోటీని ప్రదర్శించే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.
ఇదిలా ఉంటే.. టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జట్టు కేకేఆర్ పది పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతుండగా, చెన్నై కూడా అదే పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. ఇరుజట్లు ఇప్పటివరకు ఆడిన పదకొండు మ్యాచ్‌ల్లో ఐదింటిలో విజయాన్ని, మిగిలిన ఆరింటిలో పరాజయాల్ని చవిచూశాయి.