ఐపీఎల్ నిబంధనల ఉల్లంఘన: శ్రీశాంత్‌కు జరిమానా!

FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిబంధనలను ఉల్లఘించిన కారణంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పేస్ బౌలర్ శ్రీశాంత్‌కు 9వేల డాలర్ల జరిమానా విధించారు.

రాజస్థాన్ రాయల్స్‌- కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య బుధవారం జరిగిన 38వ లీగ్ మ్యాచ్‌లో శ్రీశాంత్ అంపైర్‌ నిర్ణయానికి విరుద్ధంగా ప్రవర్తించాడు. తన బౌలింగ్‌లో రెండు బంతులను అంపైర్ నో-బాల్ అని ప్రకటించడంతో వివాదాస్పద పేసర్ శ్రీశాంత్ ఆగ్రహానికి గురైయ్యాడు.

అనంతరం మైఖేల్ లంబ్ బౌండరీ కొట్టడంతో అంపైర్‌ను చూస్తూ.. ఆవేశంతో శ్రీశాంత్ చప్పట్లు కొట్టాడు. ఈ విధంగా ప్రవర్తించడం అంపైర్ నిర్ణయాన్ని, ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌ను ఉల్లంఘించినట్లవుతుంది.

దీంతో శ్రీశాంత్ నిబంధనలను ఉల్లంఘించాడంటూ.. అతని ఈ మ్యాచ్ ద్వారా వచ్చిన ఆదాయంలో 20శాతం (9వేల డాలర్లు) మొత్తాన్ని జరిమానాగా చెల్లించాల్సిందిగా ఐపీఎల్ యాజమాన్యం పేర్కొంది.

రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్, మైకేల్ లంబ్ బ్యాటింగ్‌‌లో మూడో ఓవర్‌కు శ్రీశాంత్ బంతులేశాడు. ఈ సందర్భంగా రెండు బంతులను అంపైర్ నోబాల్‌గా నిర్ధారించాడు. కానీ అంపైర్ నిర్ణయాన్ని అవహేళన చేస్తూ.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ లంబ్‌ కొట్టిన బౌండరీని అభినందిస్తూ.. చప్పట్లు కొట్టాడు.

దీంతో ఐపీఎల్ యాజమాన్యం అతనిపై ఐపీఎల్ నిబంధనల ప్రకారం 2.1.3 కింద 9వేల డాలర్ల మొత్తాన్ని జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది. ఇంకా శ్రీశాంత్‌ను పంజాబ్ ఆటగాడు, ఆ జట్టు మాజీ కెప్టెన్ యువరాజ్ సింగ్ కూడా మైదానంలో హెచ్చరించడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి