ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌కు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జాకబ్ ఓరమ్ దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 6న జరిగే దేశీయ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆడేందుకు శరీరం సహకరించని పక్షంలో.. ఆపై జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా ఓరమ్ దూరంగా కానున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఓరమ్ చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో ఆడేందుకు వీలుగా ఓరమ్ ప్రస్తుతం భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉన్నాడనే వార్తా కథనాలను ఓరమ్ ఈ సందర్భంగా తోసిపుచ్చాడు. ఓరమ్ కాలి గాయంతో బాధపడుతున్నాడు.
ట్వంటీ- 20 సిరీస్‌కు సిద్ధంగా ఉండేందుకు టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉన్నాననే ఊహాగానాలు సరికాదని, దేశీయ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు తాను సిద్ధం కాలేకపోతే, ఆపై జరిగే ఐపీఎల్ రెండో సీజన్‌కు కూడా దూరంగా ఉంటానని ఓరమ్ చెప్పినట్లు ది డొమినియన్ పోస్ట్ వెల్లడించింది. అయితే ఫైనల్ సమయానికి కోలుకుంటానని ఓరమ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.