కెప్టెన్సీ విధానంపై మాట్లాడను: గంగూలీ

కొల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు కోచ్ బుచానన్ ప్రకటించిన బహుళ కెప్టెన్సీ విధానంపై ఇకపై మాట్లాడనని టీం ఇండియా మాజీ కెప్టెన్, బెంగాల్ దాదా సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు.

ఐపీఎల్‌లో కొల్‌కతా జట్టు తరపున మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తానని గంగూలీ తెలిపాడు. బ్లొంఫాటైన్‌లో బుధవారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో 61 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌కు అనంతరం గంగూలీ మీడియాతో మాట్లాడుతూ.. ఐపీఎల్ రెండో సీజన్‌లో అద్భుత ఫామ్‌ను ప్రదర్శించేందుకు శిక్షణ పొందుతున్నానని గంగూలీ తెలిపాడు.

ఇదిలా ఉండగా.. ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ రెండో సీజన్లో, కేకేఆర్ జట్టు రెండో రోజు మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో.. ఇంతకుముందు జరిగిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లలో కేకేఆర్ పరాజయాన్ని చవిచూసింది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లలో పేసర్ అజిత్ అగార్కర్ మరియు లాంగ్వెడ్త్‌లు ధీటుగా రాణించారు.

వెబ్దునియా పై చదవండి