గవాస్కర్ తర్వాత సెహ్వాగే ఉత్తమ ఓపెనర్: గంభీర్

భారత జట్టుకు అలనాటి క్రికెట్ లెజండ్ సునీల్ గవాస్కర్ తర్వాత లభించిన అత్యుత్తమ ఓపెనర్ సెహ్వాగ్ అని అతని సహచరుడు, ఢిల్లీ ఓపెనర్ గౌతం గంభీర్ అన్నాడు. న్యూజిలాండ్ పర్యటనలో అద్భుతంగా రాణించిన సెహ్వాగ్‌పై గౌతం గంభీర్ ప్రసంశల వర్షం గుప్పించాడు. దీనిపై గంభీర్ మాట్లాడుతూ పోలికలను నేను విశ్వసించను. ఐతే నా అభిమాన ఆటగాడు సెహ్వాగ్. వీరు గొప్ప బ్యాట్స్‌మెన్. అతని కోసం నేను ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాను అని గంభీర్ అన్నాడు.

రాహుల్ ద్రావిడ్ తర్వాత టీమ్ ఇండియాకు లంభించిన రెండో గోడ గంభీర్ అని సెహ్వాగ్ కితాబిచ్చిన విషయం తెల్సిందే. దీనిపై గంభీర్ పైవిధంగా స్పందించారు. నేపియర్‌లో 137 పరుగుల ఇన్నింగ్సే ఉత్తమనైనది. నాకెంతో ప్రత్యేకమైనది. ఐతే కెరీర్‌లో ఉత్కృష్టమైన ఇన్నింగ్స్‌ ఇదేనని చెప్పలేను. దాదాపు 11 గంటలకు పైగా బ్యాటింగ్ చేసినా ఎక్కడా ఒత్తిడికి లోనుకాలేదని గంభీర్ చెప్పుకొచ్చాడు. కాగా, కివీస్ సిరీస్‌ విజయానికి మూలకారణం జహీర్‌ఖాన్, హర్భజన్‌ సింగ్‌లేనని గంభీర్ అన్నాడు.

వెబ్దునియా పై చదవండి