ట్వంటీ-20 ప్రపంచకప్‌: స్ట్రాస్‌కు దక్కని చోటు

జూన్‌లో జరుగనున్న ట్వంటీ-20 ప్రపంచకప్ జట్టులో ఇంగ్లండ్ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్‌కు చోటు దక్కలేదు. ఈ టోర్నీకి 30 మందితో కూడిన ప్రాబబుల్స్ జట్టును ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది.

ఇందులో.. కెప్టెన్ బాధ్యతలు చేపట్టే క్రికెటర్ పేరు ఇంకా నిర్ణయించలేదు. కెంట్ బ్యాట్స్‌మన్ రాబర్ట్ కీ, మస్కరెన్హాస్‌లలో ఒకరికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ఈసీబీ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో స్ట్రాస్ బ్యాటింగ్ శైలి ట్వంటీ-ట్వంటీల కంటే సహనంతో ఆడే టెస్టులకు, వన్డేలకు మాత్రమే సరిపోతుందని జాతీయ సెలక్టర్ మిల్లర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా.. ఐసీసీ ట్వంటీ-ట్వంటీ ప్రపంచ కప్‌లో జూన్ ఐదో తేదీ నుంచి 21వ తేదీవరకు జరుగనుంది. ఈ ట్వంటీ-20కి ఈసీబీ ప్రకటించిన తొలి విడత ప్రాబబుల్స్ జట్టులో ఖబీర్ అలి, జేమ్స్ ఆండర్సన్, గరేథ్ బాటి, ఐయాన్ బెల్, రవి బొపరా, టిమ్ బ్రెస్నన్, స్టువర్ట్ బ్రాడ్, పాల్ కాలింగ్‌వుడ్, స్టీవెన్ డేవిస్, జో డేన్లీ, జేమ్స్ ఫోస్టర్, ఆండ్రూ ఫ్లింటాఫ్, స్టీఫన్ హామిర్సన్, రాబర్ట్ కి, సజీద్ మహ్మూద్, దిమిత్రి, మోర్గాన్, గ్రహం నేపియర్, సమిత్ పటేల్, కెవిన్ పీటర్సన్, లియామ్ ప్లున్కెట్, మాథ్యూ ప్రియర్, అదిల్ రషీద్, ఒయాసిస్ షా, రియాన్ సైడ్‌బాటమ్, గ్రేమ్ స్వాన్, క్రిస్ ట్రెమ్లెట్, షాన్ ఉడాల్, క్రిస్ వోక్స్, లూక్ వ్రైట్‌లకు స్థానం దక్కింది.

వెబ్దునియా పై చదవండి