ట్వంటీ-20 వరల్డ్‌కప్: పాక్ బౌలర్లు ఫిట్‌గా ఉన్నారా..!?

PTI
కరేబియన్ గడ్డపై ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ట్వంటీ-20 ప్రపంచకప్ పోటీల్లో ఆడే పాకిస్థాన్ బౌలర్ల ఫిట్‌నెస్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్ పేస్ బౌలర్ ఉమర్ గుల్ మరియు ఆల్ రౌండర్ యూజిర్ అరాఫత్‌లు ట్వంటీ-20 ప్రపంచకప్‌కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయని మీడియాలో వార్తలొస్తున్నాయి.

ఈ విషయమై పాకిస్థాన్ ట్వంటీ-20 కెప్టెన్ షాహిద్ అఫ్రిది మాట్లాడుతూ.. అరాఫత్ మాత్రం కాలిపిక్క గాయంతో బాధపడుతున్నాడని తెలిపాడు. దీంతో అరాఫత్ ఫిట్‌నెస్‌పై సంశయం నెలకొందని షాహిద్ అఫ్రిది చెప్పాడు.

కానీ పాక్ బౌలర్ల ఫిట్‌నెస్‌పై పాకిస్థాన్ జట్టు మేనేజర్ యావర్ సయ్యీద్ మీడియాతో మాట్లాడుతూ.. ఉమర్ గుల్ మరియు అరాఫత్‌లు తుదిదశ ఫిట్‌నెస్ టెస్టులకు ఈ నెల 19, 20 తేదీల్లో హాజరుకానున్నట్లు వెల్లడించారు.

కాగా.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు చెందిన మెడికల్ ప్యానెల్ ఫిట్‌నెస్ రిపోర్టు మేరకే అరాఫత్ మరియు ఉమర్‌గుల్‌లు ప్రపంచకప్ ట్వంటీ-20 మ్యాచ్‌ల్లో ఆడుతారా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉందని క్రీడావిశ్లేషకులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి