నాలుగో టెస్టు: మార్పులు లేని విండీస్ జట్టు

మంగళవారం, 24 ఫిబ్రవరి 2009 (10:32 IST)
స్వదేశంలో ఇంగ్లండ్ జట్టుతో మంగళవారం నుంచి ప్రారంభమయ్యే నాలుగో టెస్టుకు కోసం ప్రకటించిన వెస్టిండీస్ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. మూడో టెస్ట్‌లో బరిలోగి దిగిన జట్టునే నాలుగో టెస్ట్‌కు ప్రకటించారు. కాగా, ఈ టెస్టు బార్బడోస్‌లోని కింగ్‌స్టన్ ఓవల్ మైదానంలో జరుగుతుంది. మొత్తం నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో ఆతిథ్యం విండీస్ జట్టు తొలి టెస్టులో విజయం సాధించింది.

ఆ తర్వాత రెండో టెస్ట్ రద్దు కాగా, మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది. దీంతో 1-0 తేడాతో విండీస్ సిరీస్ ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. అయితే.. ఇంగ్లండ్ జట్టు మాత్రం ఒక మార్పు చేయనుంది. ఆ జట్టు ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ గాయం నుంచి వైదొలగడంతో అతని స్థానంలో మరొకరికి ఛాన్స్ ఇవ్వనున్నారు.

జట్టు వివరాలు.. క్రిస్ గేల్ (కెప్టెన్), రామ్‌దిన్ (వికెట్ కీపర్), బాకర్, బెన్, చందర్‌పాల్, ఎడ్వర్డ్, హిండ్స్, బ్రెండెన్ నాష్, డారెన్ పావెల్, శర్వాన్, సిమ్మన్స్, స్మిత్, టేలర్.

వెబ్దునియా పై చదవండి