పాక్ క్రికెటర్ ఆసిఫ్‌‌కు మాజీ ప్రేయసి లీగల్ నోటీసు!

PTI
పాకిస్థాన్ క్రికెటర్లను వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను పెళ్లి చేసుకుంటానంటూ.. హైదరాబాద్‌కు వచ్చి ఇరుక్కుపోయిన షోయబ్ మాలిక్.. ఇప్పుడిప్పుడే తొలి భార్య అయేషా సమస్య నుంచి బయటపడుతుంటే.. మరో పాక్ క్రికెటర్ మొహమ్మద్ ఆసిఫ్‌ కొత్త వివాదంలో చిక్కుకున్నాడు.

తాజాగా వివాదాస్పద పాక్ క్రికెటర్ మొహమ్మద్ ఆసిఫ్‌కు మాజీ ప్రేయసి, నటీమణి వీణా మాలిక్‌ లీగల్ నోటీసు పంపింది. తన వద్ద నుంచి ఆసిఫ్ 18లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నాడని, ఈ మొత్తంలో 11 లక్షల రూపాయలను చెక్‌ల రూపంలో ఇచ్చాడని వీణా మాలిక్ చెప్పింది. అయితే ఈ రెండు చెక్‌లు డబ్బుల్లేక తిరిగి వచ్చేశాయని మాలిక్ వెల్లడించింది. దీంతో ఆసిఫ్‌కు మాలిక్ లీగల్ నోటీసు పంపింది.

ఇదిలా ఉంటే.. ఐపీఎల్ తొలి సీజన్‌లో నిషేధిత ఉత్ర్పేరకాలను సేవించాడంటూ.. ఆసిఫ్‌లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిషేధం వేటు వేసిన సంగతి తెలిసిందే. ఇంకా ఐపీఎల్-1ను ముగించుకుని స్వదేశానికి తిరుగుతుండగా దుబాయ్ విమానాశ్రయంలో ఆసిఫ్ డ్రగ్స్‌తో దొరికిపోయాడు. ఈ వివాదాల కారణంగా ఆసిఫ్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఏడాది పాటు నిషేధం వేటు వేసింది.

వెబ్దునియా పై చదవండి