ప్రస్తుతానికి కనేరియాపై ఎలాంటి చర్యలు లేనట్లే..!: పీసీబీ
FILE
ఇంగ్లాండ్ కౌంటీ జట్టైన ఎసెసెక్స్ క్రెకెటర్ల వద్ద మ్యాచ్ ఫిక్సింగ్ విచారణ జరుగుతోంది. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంలో పాకిస్థాన్ క్రికెటర్ డానిష్ కనేరియాకు కూడా పాల్గొన్నాడని ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
అయితే మ్యాచ్ ఫిక్సింగ్‌పై జరుగుతున్న దర్యాప్తులో నిజానిజాలు వెల్లడయ్యేంతవరకు కనేరియాపై ఎలాంటి చర్యలు ఉండవని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.
కనేరియాపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు నిజమైతే, అతనిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పీసీబీ వెల్లడించింది. అయితే ముందు మ్యాచ్ ఫిక్సింగ్ విచారణలో నిజాలేంటో? తెలియరావాల్సి ఉందని పీసీబీ స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ కౌంటీ జట్టులో ఇద్దరు క్రికెటర్లు మాత్రమే మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారనే వార్తల్లో కొంత నిజం లేకపోయినా, జట్టు క్రికెటర్లు ప్రదర్శించిన పేలవమైన బౌలింగ్, వైడ్, నోబాల్‌లతో మ్యాచ్ ఫిక్సింగ్ చేశారనే అనుమానం నెలకొంటోందని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది.
అయితే.. మ్యాచ్ ఫిక్సింగ్ అంశంపై విచారణ జరుపుతున్నందున ఇప్పుడే ఎలాంటి అభిప్రాయాలను నిర్ధారించి చెప్పడం సాధ్యం కాదని మెల్‌బోర్న్ క్రికెట్ క్లబ్ వెల్లడించింది.