ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో భాగంగా.. హైదరాబాద్ ఫ్రాంచైజీ జట్టు డెక్కన్ ఛార్జర్స్‌తో గురువారం జరిగిన 40వ లీగ్ మ్యాచ్‌లో తమ జట్టు బౌలర్లు విఫలమయ్యారని కెప్టెన్ అనిల్ కుంబ్లే అన్నాడు. తమ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన 184 పరుగులను అధిగమించడం కష్టతరమైనప్పటికీ.. బౌలర్లు పూర్తిగా విఫలం కావడంతోనే పరాజయం పాలైయ్యామని కుంబ్లే వెల్లడించాడు.
డెక్కన్ ఛార్జర్స్ ఆటగాళ్లలో సుమన్ (57 బంతుల్లో 78 పరుగులు), ఆండ్రూ సైమండ్స్ (24 బంతుల్లో 53 పరుగులు) సూపర్ ఇన్నింగ్స్‌కు తన జట్టు బౌలర్లు బ్రేక్ వేయలేకపోయారని కుంబ్లే వాపోయాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై డెక్కన్ ఛార్జర్స్ ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిందని కుంబ్లే చెప్పుకొచ్చాడు.
మొత్తానికి రాయల్ ఛాలెంజర్స్ ఓటమికి బౌలర్లే ప్రధాన కారణమని కుంబ్లే తెలిపాడు. తమ జట్టు నిర్ధేశించిన స్కోరును డెక్కన్ ఛార్జర్స్ అద్భుతంగా చేధించిందని అనిల్ కుంబ్లే కితాబిచ్చాడు.