మళ్లీ వీరూనే వరించిన "విస్డన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్"
FILE
"విస్డన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్" అవార్డు మళ్లీ టీం ఇండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌నే వరించింది. ఇంగ్లండ్ సారధి ఆండ్రూ స్ట్రాస్ మరియు శ్రీలంక క్రికెటర్ తిలకరత్న దిల్షాన్‌ల నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ విస్డన్ అవార్డును రెండోసారి మళ్లీ వీరూనే కైవసం చేసుకున్నాడు.
కాగా.. 2004లో ప్రవేశపెట్టిన ఈ విస్డన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్, స్పిన్ విజార్డ్ షేన్ వార్న్, ఇంగ్లీష్ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తదితర క్రికెటర్లు ఇదివరకే అందుకున్నవారిలో ఉన్నారు. అలాగే వీరేంద్ర సెహ్వాగ్ కూడా గతంలో ఒకసారి ఈ విస్డన్ క్రికెటర్ అవార్డును అందుకున్నాడు. తాజాగా రెండోసారి కూడా వీరూ ఈ అవార్డుకు ఎంపికవటం విశేషంగా చెప్పవచ్చు.
అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లలో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా పేరుగాంచిన 31 సంవత్సరాల వీరూ.. గత సంవత్సరం యావరేజ్ 70, స్ట్రైక్ రేటు 108.9తోనూ, వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో స్ట్రైక్ రేటును 136గా కలిగి ఉన్నట్లు "క్రిక్ ఇన్ఫో" ప్రశంసించింది. మరోవైపు ఇంగ్లీష్ వికెట్ కీపర్ మట్ ప్రియర్, స్పిన్నర్ గ్రేమ్ స్వాన్, బ్యాట్స్‌మన్ గ్రాహం ఆనియన్స్, పేసర్ స్టువర్ట్ బ్రాడ్ మరియు ఆస్ట్రేలియన్ వైస్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్‌లతోపాటు వీరూ "ఫైవ్ క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్' అవార్డుకు కూడా ఎంపికవటం మరో విశేషం.