శుక్రవారం నుంచి వెల్లింగ్టన్లో ప్రారంభం కానున్న భారత్-కివీస్ మూడో టెస్టులో తమ జట్టు బౌలర్లు రాణిస్తారని కివీస్ జట్టు కెప్టెన్, స్కిప్పర్ డేనియల్ వెటోరి నమ్మకం వ్యక్తం చేశాడు. సోమవారంతో రెండో టెస్టు పూర్తవడంతో తమ జట్టు బౌలర్లకు మూడు రోజులు విశ్రాంతి లభించిందని అతడు చెప్పాడు.
రెండో టెస్టులో మూడు రోజులు బౌలర్లలో టీం ఇండియా బ్యాట్స్మన్లను బెంబేలెత్తింపజేసిన కివీస్ బౌలర్లు, నాలుగో రోజున కాస్త అలసటకు గురైయ్యారని వెటోరి అన్నాడు. ప్రస్తుతం టీం ఇండియా ఆటగాళ్లపై, కివీస్ బౌలర్లు తమ సత్తాను తిరిగి నిరూపించేందుకు సిద్ధమవుతున్నారని వెటోరి తెలిపాడు.
ఇదిలా ఉండగా... ఏప్రిల్ మూడో తేదీ నుంచి వెల్లింగ్టన్ స్టేడియంలో భారత్‌తో మూడో టెస్టును కివీస్‌తో ఆడనుంది. నేపియర్‌లో జరిగిన రెండో టెస్టులో భారత్‌ను కివీస్ బౌలర్లు, తొలి ఇన్నింగ్స్‌లో కట్టడి చేసినప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం బౌలర్లు విఫలమయ్యారు. ఫలితంగా భారత్ ఓటమి కోరల నుంచి గట్టెక్కి, డ్రాగా ముగించుకుంది. దీంతో మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.