రాయల్ ఛాలెంజర్స్‌పై డెక్కన్ ఛార్జర్స్ హ్యాట్రిక్ విజయం!
PTI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో డెక్కన్ ఛార్జర్స్ హ్యాట్రిక్ విజయంతో సెమీఫైనల్ అవకాశాలను సజీవం చేసుకుంది. సోమవారం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన 46వ లీగ్ మ్యాచ్‌లో డెక్కన్ ఛార్జర్స్ 13 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన డెక్కన్ ఛార్జర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల పతనానికి 151 పరుగులు సాధించింది. తదనంతరం 152 పరుగుల లక్ష్యంతో క్రీజులోకి దిగిన బెంగళూర్ 19.4 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది.
బెంగళూరు ఆటగాళ్లలో హారిస్ తొలి బంతికే అవుట్ కావడంతో ప్రారంభంలోనే కష్టాల్లో పడింది. అయితే ద్రావిడ్, కలిస్‌ల ఇన్నింగ్స్‌తో బెంగళూరు లక్ష్యంగా దిశగా సాగినట్లు కనిపించింది.
కీలక ఇన్నింగ్స్ ఆడిన ద్రావిడ్ 35 బంతుల్లో 8ఫోర్లతో49 పరుగులు చేయగా, కలిస్ 27 పరుగులతో పెవిలియన్ చేరాడు. కానీ బెంగళూరు వెంట వెంటనే వికెట్లను చేజార్చుకోవడంతో.. కుంబ్లే సేనకు ఓటమి తప్పలేదు. ఇకపోతే.. ఛార్జర్స్ బౌలర్లలో హారిస్, ఆర్పీ సింగ్, ఓజా, హర్మిత్ సింగ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. సైమండ్స్‌కు ఒక వికెట్‌కు దక్కింది.
అలాగే బెంగళూరు బౌలర్లలో స్టెయిన్ మూడు వికెట్లు పడగొట్టగా, వినయ్ కుమార్, కుంబ్లే చెరో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. కాగా.. డెక్కన్ ఛార్జర్స్ బౌలర్ హర్మిత్ సింగ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.