రెండో వన్డేకు అందుబాటులో కలిస్!

దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్ రెండో వన్డేకు అందుబాటులోకి రానున్నాడు. స్వదేశంలో పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య ధక్షిణాఫ్రికా జట్టు చిత్తుగా ఓడిపోయిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో గజ్జల్లో గాయం నుంచి కోలుకున్న ఆ జట్టు ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్ ఆసీస్‌తో రెండో పోరుకు అందుబాటులో ఉంటాడని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌లో సఫారీలు రాణించి కంగారుల ఆధిక్యాన్ని తగ్గించాలని భావిస్తున్నారు. కాగా, కలిస్ జట్టులోకి వస్తే మోర్నీ, మోర్కెల్, ఎన్తినీలలో ఒకరిపై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం జరుగనుంది.

వెబ్దునియా పై చదవండి