వన్డే సిరీస్‌ గెలిస్తే.. తిరిగి ఆసీస్‌కు అగ్రస్థానం

దక్షిణాఫ్రికా జట్టుతో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఐదు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా జట్టు కైవసం చేసుకుంటే తిరిగి నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ర్యాంకుల జాబితాలో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి, నంవర్‌వన్ స్థానాన్ని దక్షిణాఫ్రికా జట్టు కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో డర్బన్‌లోని కింగ్స్‌మెడ్ మైదానంలో శుక్రవారం నుంచి ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ఆరంభంకానుంది.

ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఆసీస్ జట్టు క్లీన్‌స్వీప్ చేస్తే తిరిగి తన నంబవర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంటుంది. అయితే, ఇది అంత సులభమైన పని కాదు. వన్డే సిరీస్ ఆరంభానికి ముందు జరిగిన రెండు ట్వంటీ-20 మ్యాచ్‌లలో ఆసీస్‌పై సఫారీలు విజయభేరీ మోగించారు. అంతేకాకుండా, సఫారీలను వారి సొంత గడ్డపై ఓడించడం ఏ జట్టుకైనా కత్తిమీద సాములాంటిదే.

ఇదిలావుండగా, దక్షిణాఫ్రికా జట్టు ఐదు మ్యాచ్‌లను క్వీన్‌స్వీప్ చేసినా, లేదా నాలుగు, మూడు మ్యాచ్‌లను గెలిచినా అగ్ర స్థానానికి ఎలాంటి ముప్పు వాటిల్లబోదు. ఒకవేళ ఒక మ్యాచ్ డ్రాగా ముగిసి, మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో ఇరు జట్లు రెండింటి చొప్పున గెలిచినప్పటికీ దక్షిణాఫ్రికా స్థానానికి ఎలాంటి ఢోకారాదని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి