వెల్లింగ్టన్‌లో కివీస్ ఎలా ఆడుతుందో..?: మార్టిన్ క్రో

భారత్‌తో వెల్లింగ్టన్‌లో జరుగనున్న మూడో టెస్టుల్లో కివీస్ ఎలా ఆడుతుందో? వేచి చూడాల్సిందేనని మాజీ కెప్టెన్ మార్టి క్రో అన్నాడు. రెండో టెస్టులో నాలుగో రోజు కివీస్ బౌలర్లు కష్టపడ్డా, టీం ఇండియాలోని రెండు గోడలను (గంభీర్, ద్రావిడ్) అధికమించడం వారి తరం కాలేదని క్రో చెప్పాడు.

టెస్టు సిరీస్‌ను న్యూజిలాండ్ సమం చేయాలంటే టీం ఇండియాలోని రెండు గోడలను అధిగమించాలని మార్టిన్ క్రో అభిప్రాయం వ్యక్తం చేశాడు. రెండో టెస్టులో గంభీర్ అద్భుతంగా ఆడాడని, డాషింగ్ ఆటగాడిగా గంభీర్ అందరికీ తెలిసినా, ఎంతో ఏకాగ్రతతో నిలకడగా రాణించి, టీమ్ ఇండియాను ఓటమి నుంచి తప్పించాడని క్రో చెప్పాడు.

ఇదిలా ఉండగా.. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న, మూడో టెస్టుకు కివీస్ జట్టులో సౌధీ, ఫ్లిన్‌కు చోటు దక్కింది. తొలి టెస్టులో భారీగా పరుగులివ్వడంతో రెండో టెస్టు నుంచి సౌధీని తప్పించారు. మరోవైపు గాయం కారణంగా రెండో టెస్టులో ఆడలేకపోయిన డానియర్ ఫ్లిన్ తిరిగి జట్టులోకి వచ్చాడు.

వెబ్దునియా పై చదవండి