ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో సచిన్ సేన ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న శ్రీలంక క్రికెటర్ సనత్ జయసూర్య రాజకీయాల్లో రాణిస్తున్నాడు. ఫలితంగా గురువారం జరిగిన శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించాడు.
శ్రీలంక దేశాధ్యక్షుడు మహీందా రాజపక్సే పార్టీ యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడమ్ అలయన్స్ (యూపీఎఫ్ఎ) తరపున ఎన్నికల్లో పోటీ చేసిన సనత్ జయసూర్య మాథరై జిల్లాకు చెందిన నియోజకవర్గంలో విజయం సాధించాడు.
కాగా.. ఐపీఎల్ మూడో సీజన్లో 14 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్ తరపున ఆడే శ్రీలంక ఆటగాడు సనత్ జయసూర్యకు శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన విషయాన్నియూపీఎఫ్ఎ తెలియజేసింది.
ఇదిలా ఉంటే.. శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను ఆ దేశ ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజపక్సే ఘనవిజయం సాధించారు.