సచిన్ క్యాచ్‌ను మిస్ చేసుకోవడమే ఓటమికి కారణం: వార్న్
PTI
ముంబై ఇండియన్స్ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ క్యాచ్‌ను చేతులారా చేజార్చుకోవడమే రాజస్థాన్ రాయల్స్ ఓటమికి ప్రధాన కారణమని ఆ జట్టు కెప్టెన్ షేన్ వార్న్ అన్నాడు. ఆదివారం జరిగిన 45వ ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 36 పరుగుల తేడాతో గెలిచింది.
ఈ విషయమై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ షేన్ వార్న్ మాట్లాడుతూ.. ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన సచిన్ టెండూల్కర్ 45 పరుగుల వద్ద ఆదిత్యా డోలేకు లభించిన క్యాచ్‌ను చేతులారా చేజార్చుకున్నాడు. 45 పరుగుల వద్ద సిద్ధార్థ్ త్రివేది సచిన్‌కు వేసిన బంతిని డోలే క్యాచ్‌గా మలచలేకపోయాడని వార్న్ వాపోయాడు. దీంతో సచిన్ టెండూల్కర్ 59 బంతుల్లో 89 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడని షేన్ వార్న్ వెల్లడించాడు.
ఇంకా రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్, ఫీల్డింగ్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సచిన్ సేన 174 పరుగుల భారీ స్కోరును చేధించలేకపోయాయమని షేన్ వార్న్ తెలిపాడు. కాగా.. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ నాయకత్వం వహించే ముంబై ఇండియన్స్ గెలుపును నమోదు చేసుకుని సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.