సచిన్ గొప్ప బ్యాట్స్‌మెన్: హాడ్లీ

టీం ఇండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రపంచ క్రికెట్‌లో గొప్ప క్రికెటర్ అని న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ రిచర్డ్ హాడ్లీ అభిప్రాయపడ్డారు. బ్రాడ్‌మెన్ సగటు సాధించలేకపోయినప్పటికీ, అన్నిరకాల క్రికెట్‌లో సచిన్ ప్రదర్శించిన నైపుణ్యం, అతడిని ఎప్పటికీ గొప్ప బ్యాట్స్‌మెన్‌ను చేసిందని ఈ న్యూజిలాండ్ క్రికెట్ లెజెండ్ పేర్కొన్నారు.

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) హాల్ ఆఫ్ ఫేమ్‌లో శుక్రవారం తనను చేర్చిన సందర్భంగా హాడ్లీ మాట్లాడుతూ... భారత పరుగుల యంత్రం, సచిన్ టెండూల్కర్ ఆటతీరు తననెంతో అబ్బురపరుస్తుందని చెప్పారు. ఎప్పటికీ సచిన్ గొప్ప బ్యాట్స్‌మన్ అనడంలో సందేహామే లేదని హాడ్లీ తెలిపారు.

వన్డే క్రికెట్, టెస్ట్ క్రికెట్‌లో సాధించిన సెంచరీలు, అర్ధ సెంచరీలు, పరుగులే సచిన్ ప్రతిభను నిరూపిస్తాయని హాడ్లీ అన్నారు. ఈ గణాంకాలే టెండూల్కర్ గ్రేటెస్ట్ బ్యాట్స్‌మన్ అనేందుకు సాక్ష్యాలని హాడ్లీ ఎత్తిచూపారు.

వెబ్దునియా పై చదవండి