సాధించాల్సింది చాలా ఉంది: గౌతం గంభీర్

న్యూజిలాండ్ పర్యటనను విజయవంతంగా ముగించడంపై టీం ఇండియా ఓపెనర్ గౌతం గంభీర్ మాట్లాడుతూ.. తానిప్పటికీ సాధించాల్సింది చాలా ఉందని వ్యాఖ్యానించాడు. న్యూజిలాండ్ పర్యటనలో గంభీర్ బ్యాటుతో అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే.

కొత్తగా లభించిన స్టార్‌డమ్‌ను అంగీకరించేందుకు గంభీర్ శుక్రవారం నిరాకరించాడు. తాను ఇప్పటికీ సాధించాల్సింది చాలా ఉందని తెలిపాడు. తాను లోపాలను సరిచేసుకునేందుకు ఇప్పటికీ ప్రయత్నిస్తున్నానని 27 ఏళ్ల ఈ ఢిల్లీ బ్యాట్స్‌మెన్ చెప్పాడు.

ఏ స్థితిలోనూ నిలిచిపోకూడదు. ముందుకెళూతూనే ఉండాలని గంభీర్ పేర్కొన్నాడు. ఆటను మెరుగుపరుచుకోవడంపై కృషి చేస్తూనే ఉండాలని ఈ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ తెలిపాడు. విదేశాల్లో మెరుగ్గా రాణిస్తుండటంపై సంతృప్తి వ్యక్తం చేశాడు.

వెబ్దునియా పై చదవండి