సాహసోపేత నిర్ణయాలకు సిద్ధం: కెప్టెన్ వెటోరీ

భారత జట్టుతో శుక్రవారం నుంచి ఆరంభంకానున్న కీలకమైన మూడో టెస్ట్‌లో సాహసోపేత నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఆతిథ్య జట్టు కెప్టెన్ డేనియల్ వెటోరీ తెలిపాడు. విజయం కోసం ఎటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేందుకైనా వెనుకాడబోమని న్యూజిలాండ్ కెప్టెన్ చెప్పాడు.

టెస్ట్ సిరీస్‌లో టీం ఇండియా 1-0 ఆధిక్యతలో ఉన్న సంగతి తెలిసిందే. సిరీస్ విజయం పర్యాటక జట్టుపరం కాకుండా అడ్డుకోవాలంటే న్యూజిలాండ్ మూడో టెస్ట్ మ్యాచ్‌లో తప్పనిసరిగా నెగ్గాల్సివుంది. తొలి టెస్ట్‌లో భారత జట్టు సాధించగా, రెండో టెస్ట్ డ్రా అయింది.

దీంతో కీలకంగా మారిన మూడో మ్యాచ్‌ శుక్రవారం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో విటోరి మాట్లాడుతూ.. సిరీస్‌ను సమం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామన్నాడు. ప్రస్తుతానికి సిరీస్ సమం చేయడం తమకు గొప్ప ఫలితమని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో విజయం కోసం ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టమని స్పష్టం చేశాడు.

వెబ్దునియా పై చదవండి