సెమీస్ బెర్త్ కోసం ముంబైపై ఢిల్లీ డేర్‌డెవిల్స్ నెగ్గేనా..?!
FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచెల పోటీల్లో భాగంగా.. సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకునేందుకుగాను ఢిల్లీ డేర్‌డెవిల్స్.. ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ముంబై వేదికగా జరిగే 47వ లీగ్ మ్యాచ్‌లో ముంబైపై నెగ్గడమే లక్ష్యంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్ బరిలోకి దిగనుంది.
కానీ.. ముంబైపై జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. అలాగే ఢిల్లీ డేర్‌డెవిల్స్ సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకోవాలంటే.. ముంబైతో జరిగే మ్యాచ్‌తో పాటు మరో రెండు మ్యాచ్‌ల్లో నెగ్గాల్సిన అవసరం ఉంది. అయితే ముంబై గడ్డపై సచిన్ టెండూల్కర్ సేనను మట్టికరిపించడం.. ఢిల్లీకి కష్టతరమేనని క్రీడా విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఆదివారం జరిగిన 45వ లీగ్ మ్యాచ్‌లో సచిన్ సేన రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. దీంతో ముంబై ఇండియన్స్ ఎనిమిది విజయాలు, 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అలాగే ఇప్పటివరకు 11 మ్యాచ్‌లాడిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు ఆరింటిలో విజయాలను, మిగిలిన ఐదింటిలో పరాజయాలను నమోదు చేసుకుని మూడో స్థానంలో కొనసాగుతోంది.